పార్వతమ్మకు మెరుగైన వైద్యం అందించాలి

579చూసినవారు
పార్వతమ్మకు మెరుగైన వైద్యం అందించాలి
నారాయణపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీ పార్వతమ్మ ఇటీవల కూలీ పని చేస్తూ ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం, నాయకులు శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కొరకు హైద్రాబాద్ తరలించాలని జిల్లా ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించి వైద్యం కొరకు ఏర్పాట్లు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్