దామరగిద్ద: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష

80చూసినవారు
దామరగిద్ద: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కర్ణాటక రాష్ట్ర గుర్మిట్కల్ తాలూకా చప్పేట్ల గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తికి కోస్గి జడ్జి ఫర్హీన్ బేగం రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారని ఎస్సై రాజు తెలిపారు. నవంబర్ 6, 2024న దామరగిద్ధలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుపుతుండగా, అతిగా మద్యం సేవించి పట్టుబడినట్లు చెప్పారు. కోర్టులో హాజరు పరచగా శిక్ష విధించారని ఎస్సై తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్