దన్వాడ మండలం మందిపల్లి గ్రామంలో సాగు నీరు అందక ఎండిన పంట పొలాలను గురువారం బీజేపీ నాయకులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఎంత మేరకు నష్టం వాటిల్లింది, ఎన్ని ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ మాట్లాడుతూ. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావుల నుండి నీరు రాకపోవడంతో పంటలు ఎందుతున్నాయని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.