అక్రమ నిర్మాణాలు కూల్చివేత

1097చూసినవారు
మరికల్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 1లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు రాత్రికి రాత్రి కూల్చి వేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని కూల్చి వేయాలని గతంలో అఖిలపక్షం నాయకులు తహసీల్దార్, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు నిన్న రాత్రి జేసిబిల సహాయంతో నిర్మాణాలను నేలమట్టం చేశారు. అధికారులు స్పందించడం పట్ల అఖిలపక్షం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్