నారాయణపేట నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని డిఈఓ గోవిందరాజులు, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనసూయ, మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదట సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నిత్యజీవితంలో సైన్స్ ఉపయోగం గురించి వివరించారు.