వాగులో క్షుద్ర పూజల కలకలం (వీడియో)
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్ర పూజల కలకలం రేపాయి. ఆదివారం ఉదయం కుదురుపల్లి గ్రామానికి చెందిన యువకులు వాకింగ్ కు వెళ్లగా వాగులో క్షుద్ర పూజలు చూసి భయాందోళనలకు గురయ్యారు. మేకపోతును బలిచ్చి, కొబ్బరికాయలు, అన్నం బట్టలను వదిలేశారు. క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను చూసి జనం ఆందోళన చెందుతున్నారు.