వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం

83చూసినవారు
వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం
కుల, మత, లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ సాగర్ అన్నారు. ఆదివారం నారాయణపేట మండల కోటకొండ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పార్టీల నాయకులు కుల మతాలను రాజకీయాల కొరకు వాడుకుంటున్నారని అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసి పార్టీలను ప్రజలు ఆదరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్