నారాయణపేట: మెడికల్ కళాశాలను పరిశీలించిన ఇంజనీర్ల బృందం

72చూసినవారు
నారాయణపేట: మెడికల్ కళాశాలను పరిశీలించిన ఇంజనీర్ల బృందం
టీజీ ఎంఐడిసి ఇంజనీర్ల బృందం నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి వద్ద ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మెడికల్ కళాశాలను బుధవారం పరిశీలించింది. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాoకిషన్ తో కలిసి కళాశాల భవన సముదాయాన్ని చూశారు. కళాశాలలో వివిధ విభాగాల ఏర్పాటు, అవసరమైన పరికరాలు, కల్పించాల్సిన వసతులు గురించి చర్చించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్