సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి హెచ్చరికలు, సలహాలు, సూచనలు, జాగ్రత్తలు చేస్తూ శనివారం నారాయణపేట పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, బస్టాండ్ లో పోలీసులు ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వేరే ఊరికి వెళ్ళే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు చేశారు. దొంగతనాలు అరికట్టేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని, పోలీసుల సూచనలు పాటించాలని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.