రైతు బంధు ఇవ్వాలని నిరసన

62చూసినవారు
రైతులకు రైతు బంధు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నారాయణపేట నర్సిరెడ్డి కూడలిలో బిఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రైతు బంధు డబ్బులు ఇవ్వడం లేదని మంత్రులు చెప్పడం రైతులను మోసం చేయడమే అని అన్నారు. రైతులకు ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. రైతులకు వెంటనే బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు రాములు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్