వినియోగదారుల రక్షణ చట్టాలపై ప్రజల్లో అవగాహనా కల్పించాలని అదనపు కలెక్టర్ బెన్ షాలం అన్నారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వినియోగదారుల రక్షణ చట్టం 1986 డిసెంబర్ 24న అమలులోకి వచ్చిందని, వినయోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి వినియోగదారుల ఫోరమ్ చక్కగా పనిచేస్తున్నాయని అన్నారు.