అనర్హులను గుర్తించే పనిలో ఏపీ సర్కార్‌ బిజీ!

85చూసినవారు
అనర్హులను గుర్తించే పనిలో ఏపీ సర్కార్‌ బిజీ!
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పక్క పెన్షన్లు, మరో పక్క ఇళ్ల స్థలాలపై సర్వేలు చేస్తూనే మరో పక్క అనర్హులను గుర్తించే పనిలో బిజీ అయింది. రెండు కీలక అంశాలకు సంబంధించి సర్వే ముమ్మరం చేస్తోంది. ప్రజల దగ్గరకు నేరుగా వెళ్లి సమాచార సేకరణ చేపట్టింది. పెన్షన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి బోగస్‌ లబ్ధిదారుల గుర్తింపు పనిలో పడింది. అనర్హులను తొలగించి అర్హులకు న్యాయం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

సంబంధిత పోస్ట్