భూ బాధితులకు న్యాయం చేయాలని వినతి

61చూసినవారు
భూ బాధితులకు న్యాయం చేయాలని వినతి
నారాయణపేట మండలం అప్పంపల్లి వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని బుధవారం కలెక్టరేట్ ఏఓ నర్సింగ్ రావుకు వినతి పత్రం అందించినట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం తెలిపారు. కళాశాల నిర్మాణానికి జాజాపూర్ గ్రామానికి చెందిన రైతులు 32 ఎకరాల వ్యవసాయ భూములను మూడేళ్ళ క్రితం అప్పగించారని, నేటికి పరిహారం అందలేదని అన్నారు. 2013 చట్టం ప్రకారం పరిహారం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్