నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని ధర్నా

51చూసినవారు
నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని ధర్నా
నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, పరీక్షను మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నారాయణపేట పట్టణంలోని నర్సిరెడ్డి చౌరస్తాలో ఎన్ ఎస్ ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్షల్లో జరిగిన తప్పులకు గాను మంచిగా చదువుకున్న పెద విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలను దూరం చేశారని, నష్టం కలిగించారని అన్నారు. అవకతవకలపై అత్యున్నత సంస్థతో విచారణ చేయించాలని నాయకులు అన్వర్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్