నారాయణపేటలో బీజేపీకి షాక్.. రాష్ట్ర నాయకులు రాజీనామా

60చూసినవారు
నారాయణపేటలో బీజేపీకి షాక్.. రాష్ట్ర నాయకులు రాజీనామా
నారాయణపేట నియోజకవర్గంలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రథంగ్ పాండు రెడ్డి గురువారం రాజీనామా చేస్తూ తన లేఖను రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన బలమైన నాయకుడిగా ఉన్నారు. ఆయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహమూద్ అలీ పార్టీకి, పదవులకు, సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్