జిల్లాలో యువజన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కోట్ల మధుసూదన్ రెడ్డి శనివారం మక్తల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలను యువత ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్ళాలని అన్నారు.