నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఎల్ఈడి బల్బులు, వర్మికంపోస్టు ఎరువుల తయారీపై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. విద్యార్థుల చేత ఎల్ఈడి బల్బులు, వర్మి కంపోస్టు ఎరువుల తయారు చేయించారు. ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించి శిక్షణ ఇచ్చామని అన్నారు.