నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని శంకర్ గంజ్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో, శాంతి భద్రతలను పరిరక్షించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.