వనపర్తి జిల్లా చిట్యాల జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, ఆహార నిల్వల గదిని పరిశీలించారు. ఫుడ్ కమిటీ మానిటర్లతో ఆహార పదార్థాల నాణ్యత, పరిమాణంపై ఆరాతీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. బాగా చదువుకోవాలని, తల్లి దండ్రులకు, పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.