ఆన్ లైన్ సేవల అంతరాయంతో ఇబ్బందులు

64చూసినవారు
ఆన్ లైన్ సేవల అంతరాయంతో ఇబ్బందులు
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో గురువారం ఆన్ లైన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో బారులు తీరిన వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తడంతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సేవలు నిలిచిపోయాయని తపాలా కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్