వనపర్తి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో క్యాన్సర్ పై మున్సిపల్ కార్మికులకు అవగాహన కల్పించి ప్రాథమిక దశలోనే గుర్తించేలా క్యాన్సర్ నిర్ధారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు. ఈ మేరకు బుధవారం యం. ఎన్. జే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ కార్యక్రమాన్ని కలెక్టర్ వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించారు.