రాష్ట్ర సదస్సుకు తరలిన ఉపాధి కూలీలు

84చూసినవారు
రాష్ట్ర సదస్సుకు తరలిన ఉపాధి కూలీలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో తలపెట్టిన రాష్ట్ర సదస్సుకు అమరచింత నుంచి ఉపాధి కూలీలు తరలి వెళ్లారు. రాష్ట్ర సదస్సులో ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ తెలిపారు. సదస్సుకు ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో తరలినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్