వనపర్తిలో గుండెపోటుతో వ్యక్తి మృతి.. ఎమ్మెల్యే నివాళి

1565చూసినవారు
వనపర్తిలో గుండెపోటుతో వ్యక్తి మృతి.. ఎమ్మెల్యే నివాళి
వనపర్తి జిల్లా కేంద్రంలో బండారు నగర్ టిఫిన్ సెంటర్ గోపాల్(52) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఇంట్లో ఉండగా ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ వార్త విని తట్టుకోలేని ఆయన పెద్ద కుమారుడు అస్వస్థతకు గురయ్యారని కుటుంబీకులు తెలిపారు. బుధవారం భౌతికకాయాన్ని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్