షెడ్డు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి: ఐక్యవేదిక

77చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డ్ హమాలీలు షెడ్డు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం హమాలీలతో కలిసి సతీష్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న షెడ్డును తొలగించడంతో హమాలీలు రోడ్డు పైనే ఉండాల్సి వస్తుందని, కూర్చోవడానికి, భోజనం చేయడానికి హమాలీలు ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నారని, షెడ్డు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్