రోడ్డుపై వర్షం.. చిరు వ్యాపారుల అవస్థలు

73చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలో కురిసిన తేలికపాటి వర్షంతో కమాన్ చౌరస్తాలో వర్షం నీరు నిలిచిపోయింది. మురుగు కాలువల్లోకి వర్షం నీరు పోయేందుకు అవకాశం లేకపోవడంతో వర్షం నీరు రోడ్లపైనే నిలిచిపోయింది. చిరు వ్యాపారులు, వాహనదారులు, బాటసారులు, కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోళ్లకు వచ్చిన వినియోగదారులు అవస్థలు పడ్డారు. కమాన్ లోని భూగర్భ కాలువలపై మూతలు తొలగించకపోవడంతో నిలిచిన వర్షం నీటితో రోడ్లు మడుగును తలపించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్