రంజాన్ క్రమశిక్షణ, దాతృత్వానికి ప్రతీక: నిరంజన్ రెడ్డి

67చూసినవారు
రంజాన్ క్రమశిక్షణ, ధార్మిక, దాతృత్వానికి ప్రతీకని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేర్ లో మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పండుగలు జాతీయతకు, సంస్కృతికి నిదర్శనమని కొనియాడారు. రంజాన్ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎద్దుల కరుణశ్రీ, కర్రె స్వామి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్