విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యంగా, ఆరోగ్యకరంగా ఉండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కేడిఆర్ నగర్ లోని మైనార్టీ గురుకుల కళాశాలను, పెద్దగూడెంలోని మహిళ అగ్రికల్చర్ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్, వంటగదిలను పరిశీలించారు. నాణ్యమైన ఆహారాన్ని మెనూ ప్రకారం విద్యార్థులకు అందజేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.