ప్రజా పాలన గ్రామసభల్లో పాల్గొనేందుకు వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం సల్కెలాపురంకు గురువారం వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి లకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఎద్దుల బండిపై ఊరేగిస్తూ డప్పు వాయిద్యాల మధ్యన నృత్యాలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.