మధ్యప్రదేశ్ షియోపూర్‌లో ఈ నెల 14న జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని పాలిరోడ్ వద్ద ఓ మహిళ తన బిడ్డను స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తోంది. ఆ సమయంలో ఆమెకు ఓ దుండగుడు ఎదురయ్యాడు. అకస్మాత్తుగా ఆమెపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ తేరుకునేలోపే దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.