మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. లసుడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగపూర్ టౌన్‌షిప్‌లో ఓ వ్యక్తి ఎయిర్ గన్‌తో వీధి కుక్కలపై కాల్పులు జరిపాడు. ఓ కుక్క చనిపోగా, మరో మూడు కుక్కలు గాయపడ్డాయి. నిందితుడు కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడ మరో ముగ్గురు ఉన్నారు. నిందితుడిని ఆపేందుకు వారు ఏ మాత్రం ప్రయత్నించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.