బెల్లంపల్లి పట్నంలోని మహాత్మ జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల స్కూల్ లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శనివారం కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం తో చేసిన నృత్యం పలువురిని ఆకర్షించింది. బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ ఆసక్తిగా తిలకించారు.