బెల్లంపల్లి: ఆరిజన్ డైరీ నారాయణపై దాడి చేసిన ఇద్దరి అరెస్ట్

77చూసినవారు
బెల్లంపల్లి: ఆరిజన్ డైరీ నారాయణపై దాడి చేసిన ఇద్దరి అరెస్ట్
ఆరిజన్ డెయిరీ సీఈవో కందిమల్ల ఆదినారాయణపై దాడికి పాల్పడిన రాగంశెట్టి సతీష్, పూసాల శ్రీకాంత్ లను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ వో దేవయ్య తెలిపారు. గత నెల 29న బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు సమీపంలో ఆదినారాయణపై కొంత మంది వ్యక్తులు దాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన మరికొంత మందిని త్వరలో పట్టుకోనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్