బెల్లంపల్లి: వాడని బట్టలు సహాయం చేయండి

74చూసినవారు
బెల్లంపల్లి: వాడని బట్టలు సహాయం చేయండి
బెల్లంపల్లి తిలక్ స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పేద ప్రజల సహాయార్థం వస్త్రాల సేకరణ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న బట్టలను వాడుకోవడానికి అనుగుణంగా ఉన్న వాటిని అందజేస్తే మారుమూల గ్రామాల్లో నిరుపేదలకు అందిస్తామన్నారు. నలుగురికి మేలు జరిగే ఈ మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్