బెల్లంపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చదువు ప్రాముఖ్యత, విలువలపై విద్యార్థులకు అంజయ్య సమగ్రంగా వివరించారు. ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలల ప్రిన్సిపాళ్లు అంజయ్య, స్వరూప, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.