మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శిశుమందిర్ పాఠశాలలో లయన్స్ క్లబ్ కాల్ టెక్స్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో వేడుకలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సత్కరించారు.