తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిని కాజీపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాసిపేట మండలంలోని ముత్యంపల్లి, కాసిపేట గ్రామాల్లో క్రీడ మైదానాల కోసం నిధులు కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.