ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కన్నేపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి ఆయన కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కన్నేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.