స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండాలు చేతబూని విద్యార్థులు కళాశాల నుంచి రూరల్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు పాల్గొన్నారు.