చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో తాత్కాలికంగా పత్తి కొనుగోలును బంద్ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. జిన్నింగ్ మిల్లులో పత్తి నిలువలు పేరుకుపోయాయని జనవరి 1 నుంచి 3 వరకు పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 4, 5వ తేదీల్లో సాధరణ సెలవులు కావడంతో పత్తి కొనుగోలు బంద్ ఉంటుందని తెలిపారు. చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల రైతులు గమనించాలన్నారు.