మందమర్రి: కేకే ఓసీని సందర్శించిన డైరెక్టర్

72చూసినవారు
మందమర్రి: కేకే ఓసీని సందర్శించిన డైరెక్టర్
మందమర్రి ఏరియాలోని కేకే ఓసీని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి బుధవారం ఏరియా జీఎం దేవేందర్ తో కలిసి సందర్శించారు. పని ప్రదేశాలను పరిశీలించి ఈ ఆర్థిక సంవత్సరం ఓసీకి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, మేనేజర్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్