10, 11 తేదీల్లో మారెమ్మ జాతర

64చూసినవారు
10, 11 తేదీల్లో మారెమ్మ జాతర
కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామంలో ఈ నెల 10, 11 తేదీల్లో మారెమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవార్లకు గంగా జలంతో అభిషేకంతో జాతర ప్రారంభవుతుందని పేర్కొన్నారు. 10న అమ్మవారి బోనాల ఉత్సవం, 11న అమ్మవారి రథయాత్ర జరుగుతుందని తెలిపారు. వైభవోపేతంగా జరిగే జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్