కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో ఇటీవల వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితుల సహాయార్థం శనివారం సీపీఐ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ ఏరియాలోని వ్యాపార సంస్థలు, ప్రజల నుండి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ, వరద బాధితులకు ప్రతి ఒక్కరూ సహాయం అందించి అండగా ఉండాలని కోరారు.