Top 10 viral news 🔥
త్వరలో ఏపీ వ్యాప్తంగా కూల్చివేతలు: మంత్రి నారాయణ (వీడియో)
అక్రమ నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించిందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు చేపడతామని మంత్రి నారాయణ అన్నారు. ‘బుడమేరు ఆక్రమణల వల్లే విజయవాడకు వరదలు వచ్చాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బుడమేరు తరహా ఆపరేషన్ చేపడతాం. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలి. కబ్జాదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.’ అని మంత్రి నారాయణ వార్నింగ్ ఇచ్చారు.