మంచిర్యాల: రైతుల ఖాతాల్లో 95 కోట్ల 24 లక్షలు జమ

63చూసినవారు
మంచిర్యాల: రైతుల ఖాతాల్లో 95 కోట్ల 24 లక్షలు జమ
మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 95 కోట్ల 24 లక్షల నగదును సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేశామని అదనపు కలెక్టర్ మోతిలాల్ బుధవారం తెలిపారు. 317 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 73, 741 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8169 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని పేర్కొన్నారు. 147 కేంద్రాల్లో కొనుగోలు లక్ష్యం పూర్తి కావడంతో మూసివేశామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్