కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19 నుండి కోటి సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూసీ పేరిట రిజర్వేషన్లు కల్పించి బీసీలకు అన్యాయం చేయడం సరికాదన్నారు.