ఉన్నత చదువులు చదివి ఎన్నో కష్టనష్టాలనోర్చి పోలీసు ఉద్యోగాలు సాధించిన సిబ్బంది ప్రతి ఒక్కరు క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, నిబద్దతతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కమిషనరేట్ మీటింగ్ హాలులో నూతనంగా విధుల్లో చేరిన ఏఆర్ కానిస్టేబుళ్లకు ఆయన దిశా నిర్దేశం చేశారు. పోలీస్ శాఖలో మగ, ఆడ అని తేడా ఉండదని పోలీస్ ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని పేర్కొన్నారు.