సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడంపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు భగ్గుమన్నారు. ఈ మేరకు ఐబీ చౌరస్తాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజికి వెళ్లిన జర్నలిస్టులపై ఇలా దాడికి పాల్పడడం సరికాదన్నారు. వెంటనే మోహన్ బాబును పోలీసులు అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.