ఎస్సీ వర్గీకరణ కమిటీని రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్ అన్నారు. జండారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.