పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు

73చూసినవారు
పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు
లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు జిల్లాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని పెంపొందించేలా విస్తృత స్థాయి ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు మే 13న జరిగే పోలింగ్ లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్