మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి చేయడాన్ని మంచిర్యాల జిల్లా హరీష్ అన్న యువసేన నాయకులు కాటం రాజు తీవ్రంగా ఖండించారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కాకుండా గుండాల పాలన సాగిస్తోందని ఆరోపించారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.